Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హతలేని కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేయాలి
- సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది ఔట్సోర్సింగ్ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించకుండా, ఈఎస్ఐ, పీఎఫ్లు చెల్లించకుండా కాంట్రాక్టు ఏజెన్సీలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయని, వాటిపై విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతీనెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాల్సి ఉండగా అనేక ఏజెన్సీలు నెలల తరబడి చెల్లించడం లేదని తెలిపారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోయినా కాంట్రాక్ట్ ఒప్పం దం ప్రకారం మూడు నెలలపాటు కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఏజెన్సీదే అయినప్పటికీ ఏ ఒక్క ఏజెన్సీ కూడా ఈ నిబంధన పాటించడం లేదని పేర్కొన్నారు.కొన్ని నెలలకు సంబంధించిన జీతాలు ఒకేసారి చెల్లిస్తూ అందులో పెద్ద మొత్తంలో కోత విధిస్తూ కార్మికులను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ డైరెక్టరేట్లో 'హెచ్ఎస్ఆర్ఆర్ ప్లేస్మెంట్ సర్వీసెస్' అనే సంస్థ కార్మికులకు చెల్లించాల్సిన 13 నెలల బకాయి వేతనాల్లో రూ.40 లక్షలు కాజేసిందని, ఈ సంస్ధపై ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. జీహెచ్ఎంసీ పార్కుల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా, ఈఎస్ఐ, పీఎఫ్లు అమలు చేయకుండా కాంట్రాక్టర్లు ఎగ్గొడుతున్నారని చెప్పారు. కార్మి కులు ఎందుకలా అని అడిగితే తక్షణమే పనుల్లోంచి తొలగిస్తున్నారని తెలి పారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ పీరియడ్ ఒక ఏడాది మాత్రమే ఉండడం కూడా మరింత దోపిడీకి ఆస్కారం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీ కేటాయింపులో, ఒప్పందం చేసుకోవడంలో, నిధుల విడుదలలో నెలల తరబడి ఆలస్యం కావడంతో కార్మికులకు జీతాలు చెల్లించే సమయం నాటికే ఏజెన్సీ ఏడాది గడువు కూడా ముగిసి పోతున్నదని, దీంతో కార్మికులు నష్టపోతు న్నారని తెలిపారు. ఈ ఏజెన్సీలు ఈఎస్ఐ, పీఎఫ్లు కూడా చెల్లించ కుండానే తమ జేబుల్లో వేసుకుని వెళ్ళి పోతున్నాయని, ఏడాదికోసారి ఏజెన్సీ మార్పుతో కార్మికుల్లో గందరగోళం ఏర్పడుతున్నదని వివరించారు. కాంట్రాక్టర్లు పాత కార్మికులను తొలగించి కొత్త కార్మికులను పెట్టుకుంటూ వేల రూపాయిలు దండు కుంటున్నారని, దశాబ్దాలుగా పనిచేస్తున్న వర్కర్లను కూడా అడ్డగోలుగా తొలగిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని కోరారు. తగిన అర్హత, అనుభవం, ఆర్ధిక స్థోమత కూడా లేని ఏజెన్సీలకు కాంట్రాక్ట్ పను లు కేటాయిస్తూ అధికారులు భారీగా ముడుపులు పొందుతున్నారని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 55 కాంట్రాక్టు ఏజెన్సీలు వివిధ ఔట్సోర్సింగ్ పనులను నిర్వహిస్తున్నాయని, మెజారిటీ సంస్థలు నిబంధనలను పాటించక పోయినా ఏ ఒక్క ఏజెన్సీపై అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి లేదన్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీల నియామక పద్ధతి, నిధులు విడుదలలో తీవ్ర జాప్యం, ఏజెన్సీలపై తగిన పర్యవేక్షణ లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించిన ఏజెన్సీ లపై ఎలాంటి చర్యలూ లేక పోవడంతో కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతు న్నారని, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీల దోపిడీపై విచారణ జరిపి కార్మికుల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.