Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తుకారాంగేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. ఎల్లప్ప అన్నారు. తుకారాంగేట్ నందనార్నగర్ లోని గణపతి ఆలయంలో కాలనీ సొసైటీ సభ్యులు ఏర్పాటు చేసిన కెమెరాలను ఎల్లప్ప ప్రారంభించి మాట్లాడారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలకంగా మారుతున్నాయ న్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. తాను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకో వాలని సూచించినట్టు తెలిపారు. అపార్టుమెంట్లు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పడుతాయనీ, పలు ముఖ్యమైన కేసుల్లో త్వరగా చేధించడానికి సులువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.