Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ శివాజీనగర్ శ్రీ పెరుమాళ్ళ వెంకటేశ్వర దేవ స్థానంలో ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మౌత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు చెప్పారు. చైర్మెన్ నర్సారెడ్డి, ఈవో సత్యమూర్తి, ప్రధాన అర్చకులు సారధి స్వామి, ధర్మకర్తలు కాశిరెడ్డి నరేందర్ రెడ్డి, రాయి వెంకటేష్, కెఎం.గోవింద పింజరుల మురళి యాదవ్ వివరాలను వెల్లడించారు. రెండేండ్లుగా కరోనా కారణంగా బ్రహ్మౌత్సవాలను ఘనంగా నిర్వహించలేకపోయారనీ, ఈసారి దేవాదాయ శాఖ పాలకమండలి సభ్యుల సహకారంతో వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల కు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మొదటగా ఆహ్వాన పత్రాన్ని అందజే సినట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్ వై.నర్సారెడ్డి, ఈఈవో పాలకమండలి సభ్యులు ఈ సంద ర్భంగా బ్రహ్మౌత్సవాల ఆహ్వాన పత్రికలను కూడా ఆవిష్కరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుం డా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ఈ బ్రహ్మౌత్స వాల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను కూడా వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బ్రహ్మౌత్స వాల్లో భాగంగానే శ్రీ సుదర్శన భూవరహ స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.