Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని మేయర్ మేకల కావ్య అన్నారు. బుధవారం కార్పొరేషన్లో 27వ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్ర పురికాలనీలో రూ.4లక్షలతో చేపట్టిన అంతర్గత డ్రయినేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ గతంలో కార్పొరేషన్లో అంతర్గత డ్రయినే జీలు లేక మురుగు ఏరులై పారేదనీ, ప్రజలు అనారోగ్యా నికి గురైయ్యేవారనీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత డ్రయినేజీ, సీసీ రోడ్లతో కార్పొరేషన్ రూపురేఖలు మారిపోయాయన్నారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో జవహర్నగర్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.