Authorization
Thu March 13, 2025 10:27:16 am
- విజయసింహారెడ్డి తల్లి శారద ొపంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగర మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో తమకు ప్రాణహాని ఉందని టీఆర్ఎస్ నాయకుడు విజయసింహారెడ్డి, ఆయన తల్లి శారద ఆరోపించారు. బుధవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో బాబా ఫసియుద్దీన్‌పై ఫిర్యాదు చేశారు. బాబా రాజకీయంగా ఎదగడానికి ఎంతో కషి చేశానని, తెలంగాణ ఉద్యమకారిణిగా పనిచేశానని శారద తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కూడా తాను తెలుసని ఆమె చెప్పారు. అన్యాయంగా తమను కేసులో ఇరికించడానికి యత్నించిన ఫసియుద్దీన్‌పై పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు. నిషా గౌడ్ ఇంటికి తాను వెళ్లలేదని ఈ సందర్భంగా విజయసింహా స్పష్టం చేశారు.