Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్
- మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
నవతెలంగాణ-అంబర్‌పేట/బంజారాహిల్స్
ఆడపడుచులు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆకాంక్షించారు. బుధవారం అంబర్‌పేట ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్లు విజరు కుమార్‌గౌడ్, దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్, బి.పద్మవెంకట్‌రెడ్డి, ఉమారమేశ్ యాదవ్‌తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. ఇందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని కొనియాడారు. అంబర్‌పేట నియోజకవర్గానికి దాదాపు 70 వేల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి డివిజన్లో పెద్దఎత్తున బతుకమ్మ పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అందులో ప్రతిభ కనపరిచిన వారికి తన సొంత ఖర్చుతో బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఎంసీ వేణుగోపాల్, డీపీవో రజిత, ఏఎంహెచ్‌వో జ్వోతి, పౌరసరఫరాల అధికారి దీప్తి, అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, మహిళలు పాల్గొన్నారు.
ప్రపంచం గర్వించేలా సంక్షేమ పథకాలు
ప్రపంచ దేశాలు గర్వించేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజీగూడ, వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రపంచ దేశాలు గర్వించే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పండగ జరుపుకోవడం అలాగే అన్ని పండగలు ప్రభుత్వ లాంఛనంగా నిర్వహించడం అన్ని మతాలనూ సంస్కతులను గౌరవిస్తూ సగర్వంగా నిర్వహించుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కషి అని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నె కవితా రెడ్డి, వెల్దండ వెంకటేష్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.