Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత పద్మశాలి సంఘం
నవతెలంగాణ-అంబర్‌పేట/ఓయూ
నాటి నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన తెలంగాణ ధీశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యాదగిరిగుట్ట అధ్యక్షుడు చెరుపల్లి యాదగిరి, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు కోరారు. అంబర్‌పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతిని గోల్నాకలోని సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడు తరాలను ముద్దాడిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నో అవకాశాలు వచ్చిన పదవులను చేపట్టకుండా పోరాడిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఆయన స్మతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎలగందుల అంజయ్య, ఎస్.నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి వర్కాల కష్ణ, చిక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
ఓయూ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో..
భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరాట నాయకుడు, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి ఆయన జీవిత విషయాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఓయూ జేఏసీ నాయకులు బాలకష్ణ నేత, రాజు నేత డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఓయూలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కొండా లక్ష్మణ్ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం కబంద హస్తాల నుంచి రక్షించడంలో ఎదురొడ్డి పోరాడిన గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, మహేష్, మధు, చరణ్ సతీష్, శ్రీను, రాము, విజరు పాల్గొన్నారు.