Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
బసవ కులస్తుల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం జింఖానా క్లబ్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బసవ కులస్తుల సంక్షేమం కోసం హైదరాబాద్ కోకాపేటలో ఎకరం స్థలం కేటాయించారని గుర్తుచేశారు. అక్టోబర్ రెండో తేదీన జరిగే బసవ భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. ఈకార్యక్రమానికి బసవ కులస్తులు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.