Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య
- మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య హాజరై మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని, సుమారు 6 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా నేటికీ లక్షా పదివేలు మాత్రమే పూర్తి చేశారని, మిగిలిన ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారని సూటిగా ప్రశ్నించారు. పేదలకు లబ్ది చేకూర్చాల్సిన 57, 58 జీవోను పెద్దలకు అనుకూలంగా మలిచి రెగ్యులర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పూర్తయిన ఇండ్లు పంపిణీ జరగక అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలకు నిలయం అయిందని, భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన పేదలను గుర్తించి దరఖాస్తు చేసుకున్న వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ, కేవీపీఎస్, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సృజన, వినోద, సఫియా సుల్తానా, మంగ, నాగమణి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎర్ర అశోక్, జి శ్రీనివాసులు, ఎన్. శ్రీనివాస్, గణేష్, లింగస్వామి, ఉన్నికృష్ణ, కిష్టప్ప, సుమిత్ర, కేవీపీఎస్ నాయకులు కృపాసాగర్, పట్నం సంఘం జిల్లా నాయకులు బంగారు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.