Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీ, కీసర మండలంలోని ఆడపడుచులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నాగారం, దమ్మాయిగూడ, కీసర అభివద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించటానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నాగారం మున్సిపాలిటీకి మొదటి విడతగా 3978 చీరలు, దమ్మాయిగూడకు 2715, కీసర మండలానికి 6796 పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పూస వెంకటేష్, ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, నాగారం మున్సిపల్ కౌకుట్ల చంద్రారెడ్డి, దమ్మాయిగూడా మున్సిపల్ చైర్పర్సన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు వాణిరెడ్డి, స్వామి నాయక్, వైస్ చైర్మెన్లు బండారి మల్లేష్ యాదవ్, నరేందర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మెన్ రామిడి ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు తుంగ ధర్మేందర్, నాయకపు మాధురి వెంకటేష్, ఆకిటి మహేందర్ రెడ్డి, కౌకుంట్ల గోపాల్ రెడ్డి, పెంటయ్య, కవిత, మోర విమల, సర్పంచ్ గరుగుల అండాలు మల్లేష్, ఎంపీటీసీలు టి. నారాయణ శర్మ, వెంకటేష్, కిరణ్ జ్యోతి ప్రవీణ్, కౌన్సిల్లర్స్, కో ఆప్షన్ సభ్యులు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.