Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర నూతన సచివాలయానికి డా.బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చేవెళ్ల ఎమ్మెల్యే, జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైైర్మెన్ కాలె యాదయ్య పేర్కొన్నారు. అంబేద్కర్‌కు ఇది అపూర్వ గౌరవమని ఆయన అన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసి యేషన్ అధ్యక్షులు జి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలె యాదయ్య హాజరయ్యారు. జి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు జలమండలి ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ ఎ.ఉదరుకుమార్, నాయకులు సి.రాజు, సీహెచ్.జంగయ్య, బీ.ఆర్.శ్రీనివాస్, మొగులయ్య, ప్రేమ్‌కుమార్, దుర్గాప్రసాద్, సత్యవర్ధన్, జములా నాయక్, సక్క శేఖర్, పెద్ద ఎత్తున జలమండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.