Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్
నవతెలంగాణ-మీర్పేట్
తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కార్పొరేటర్ వేముల నర్సింహా ఆధ్వర్యంలో ఆ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు, బట్టలు, రెయిన్ కోట్లు, ఇతర వస్తువులు మేయర్, డిప్యూటీ మేయర్ పంపిణీ చేశారు. అనంతరం అయోధ్యనగర్‌లో పది లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్న తరుణంలో సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేసిన మున్సిపల్ కార్మికులకు ఏమి ఇచ్చినా తక్కువే అని అన్నారు. మున్సిపల్ కార్మికుల సేవలను వెల కట్టలేమని తెలిపారు. కార్పొరేషన్లో ఉన్న అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే మున్సిపల్ కార్మికుల వల్లనే అని కొనియాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేశ్వర్,
ఏఈ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు వేముల ఎల్లమ్మ, శానిటేషన్ సూపర్వైజర్ రంజిత్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.