Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సీఎం సహాయ నిధిపథకం పేద ప్రజలకు ఆపన్నహస్తంలా పని చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 5వ డివిజన్ వినాయక హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సరళాదేవి ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఒక కాలుకు అపరేషన్ చేయించటం కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలసి సహాయం చేయాలని కోరడం జరిగింద న్నారు. అందుకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధిత కుటుంబానికి రూ.లక్ష యాభైవేల రూపాయల చెక్కును మంత్రి నివాసంలో అందచేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటుకున్న మంత్రి
యంజాల అర్జున్.. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఓ బాలికకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వినికిడి యంత్రాని అందచేసి మానవత్వాని చాటుకున్నారని జల్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ యువనాయకులు యంజాల అర్జున్, మాజీ ఎంపీటీసీి సభ్యులు దూడల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ 20వ వార్డు శ్రీరాం కాలనీలో నివాసం ఉంటున్న ఎల్లయ్య శివరంజని దంపతుల కుమార్తె రిశిక పుట్టుకతోనే వినికిడి లోపం, మాటలు సక్రమంగా లేకపోవటంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి మరుసటి రోజే వినికిడి యంత్రాన్ని అందచేసి మానవత్వాన్ని చాటు కోవటం జరిగిందన్నారు. మానవ సేవే మాధవ సేవని ప్రతి ఒక్కరు పేద ప్రజలను మానవతా హృదయంతో అదుకోవాలన్నారు. రిశిక తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు.