Authorization
Thu March 13, 2025 09:43:13 am
- అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయకుమార్గౌడ్
నవతెలంగాణ-అంబర్పేట
కలుషిత నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజయకుమార్గౌడ్ జల మండలి అధికారులను కోరారు. గురువారం అంబర్పేట డివిజన్ సి బ్లాక్లో పర్యటించి కలుషిత, డ్రయినేజీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుషిత నీటి సరఫరాతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే జలమండలి అధికారులు సమస్యను పరిష్కరించాలని అన్నారు. వరద నీటి కాల్వలో పూడిక పేరుకుపోయిందని వెంటనే పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, హైమద్, సంతోష్చారి, వాటర్ లైన్మెన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.