Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవ వేడుకలను నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూను సందర్శించిన కాలాపత్తర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఖడ్గమృగం ఎన్‌క్లోజర్‌లో డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు, ఖడ్గమృగంపై టాక్ షో నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జూడే సందర్భంగా అక్టోబర్ 6వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తామని క్యూరేటర్ ఎస్ రాజశేఖర్ తెలిపారు.
నాలుగు ఖడ్గమృగాల దత్తత
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్, స్వామినాథన్ తన సిబ్బందితో కలిసి ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ జూలాజికల్ను సందర్శించారు, ఈసందర్భంగా జూలోని మొత్తం నాలుగు ఖడ్గమృగాలను దత్తత తీసుకున్నారు. అనంతరం ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను సందర్శించడం వల్ల జంతువులు అన్నీ తిరిగేందుకు, పెద్ద స్థలంతో కూడిన ఓపెన్ కందకాల ఎన్క్లోజర్లలో చూడటం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో కృషి చేస్తున్నందుకు క్యూరేటర్‌ను, బృందాన్ని ఆయన అభినందించారు.