Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి
నవతెలంగాణ-కల్చరల్
మహోన్నత గాయకులు ఘంటసాల, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలు, రఫీ, మహానటులు ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి వంటి వారు తమ కళ ద్వారా సజీవులై ఉంటారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు. శ్రీత్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై సప్తస్వరమాలిక సాంస్కతిక సంస్థ నిర్వహణలో బహుభాషా గాయకుడు డాక్టర్ పీబీ శ్రీనివాస్ 92వ జయంతి జరిగింది. జస్టిస్ రాధారాణి పాల్గొని మాట్లాడుతూ అంకిత భావం, క్రమశిక్షణకు మారు పేరు పీబీ శ్రీనివాస్ పలు భాషల్లో గాయకుడేకాక గొప్ప సాహితీవేత్త అని గుర్తు చేశారు. ఆకాశవాణి సంచాలకుడు ఉదరు శంకర్ మాట్లాడుతూ సంస్కతికి నేపథ్యం కళలు సాహిత్యం నేటి తరాలకు అందాలని, ఇందుకోసం పాఠ్య అంశాలు చేర్చి మార్కులు కేటాయిస్తే ఉత్తమ పౌరులు దేశానికి అందగలరని సూచించారు. పీబీ శ్రీనివాస్ కుమారుడు ఫణీంద్ర, కోడలు రోహిణి మాట్లాడుతూ పీబీ శ్రీనివాస్ పాటలు నేటి తరాలు అందిపుచ్చుకోవటానికి వారిచే పాటలు పాడించి బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రవాణాశాఖ విశ్రాంత ఉన్నతాధికారి గాంధీ, ఘంటసాల కుమార్తె శ్యామల, విశ్రాంత న్యాయమూర్తి సాంబశివ, గాయకుడు కన్నారావు, రామారావు, మురళీధర్, సహా గాయకులు శారదా రెడ్డి, పద్మశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు.