Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైదాబాద్ మండల స్థాయి మీటింగ్
నవతెలంగాణ-సంతోష్ నగర్
బాలల హక్కుల పరిరక్షణ వేదిక సైదాబాద్ మండల స్థాయి మీటింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. గురుకులాల్లో జరుగుతున్న అవకతవకలు, భోజనంలో పురుగులు రావడం, మంచినీటిలో దుర్గందమైన వాసన, టీచర్స్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించ డం, తదితర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలనీ, లేదంటే కలెక్టర్, విద్యాశాఖ ఆఫీసు వద్ద తల్లిదండ్రులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులను కలుపుకుని ధర్నా చేపడుతామని వక్తలు నిర్ణయించారు. ఈ కార్యక్ర మంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక హైదరాబాద్ నగర కార్యదర్శి లక్ష్మీ నారాయణ, అధ్యక్షుడు కృష్ణ, తల్లుల సంఘం సాయిలక్ష్మీ, సభ్యులు మదు, మదుసూ దన్, విజరు, ఎంవీ ఫౌండేషన్ సంతోష, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సైదాబాద్ మండల కన్వీనర్ షేక్ మహమూద్, కార్యదర్శి అలివేలు, బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, లక్పతి నాయక్, సీపీఐ అమీన, సుజాత పాల్గొన్నారు.