Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
- మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ
నవతెలంగాణ-ఘట్కేసర్
మమహిళల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండల గ్రామాలాలో చౌదరిగూడ పోచారం మున్సిపాలిటీ ఘట్కేసర్ మున్సిపాలిటీలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గిరిజన మహిళలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రవేశపె డుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చౌదరిగుడా గ్రామ సర్పంచ్ బైరు రమాదేవి, రాములు గౌడ్, ఉప సర్పంచ్ కుర్ర మహేందర్ గౌడ్, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముళ్ల పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్, సర్పంచులు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు
కంటోన్మెంట్ : కంటోన్మెంట్ నాలుగో వార్డులోని టికెట్లో శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, లోకానాధ్, మాజీ కార్పొ రేటర్ జి.లాస్య నందిత, మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, వినోద్, గంగారాం, పనస శ్రీకాంత్, పనస సంతోష్, తేజ్ పాల్, సదానంద గౌడ్, మురళి యాదవ్, సరిత, భాస్కర్ ముదిరాజ్, శర్వీన్, శేఖర్ ముదిరాజ్, దేవులపల్లి శ్రీనివాస్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : దసరాను పురస్కరించుకుని ఈస్ట్ ఆనంద్భాగ్ డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్ కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ చీరలను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మల్లికార్జున్, సీఓ ధనశ్రీ, డివిజన్ అధ్యక్షుడు సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, ఉమపతి, బ్రమ్మయ్య, కిషోర్, సంతోష్, భాస్కర్, కవిత, రాము, తదితరులు పాల్గొన్నారు
సంతోష్ నగర్ : దసరా సందర్భంగా ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని నారాయణ హై స్కూల్ పాఠశాల సరస్వతి నగర్ కమిటీ హాల్ శ్రీ సాయి నగర్ కమిటీ హాల్ సెంటర్స్ వద్ద మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో చీరలను కార్పొరేటర్ పంపినీ చేశారు. ఈ కార్యక్ర మంలో డీపీఓ రత్నమాల, సీఓ యాదయ్య, సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
సైదాబాద్ డివిజన్లో..
సైదాబాద్ డివిజన్ హామాలీ బస్తీ గాంధీ నగర్ పరిధిలో బతుకమ్మ చీరలను కార్పొరేటర్ కొత్త కాపు రవీందర్ రెడ్డి, డీపీఓ యుగంధర్ రెడ్డి, నరసింహ్మ, నీరజ, కార్తీక్ శ్రీకాంత్ మహేష్ రాకేష్ విజరు స్థానిక నాయకులతో కలసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కాప్రా : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేఖర్. భవాని నగర్ కమ్యూనిటీ హాల్, లాల్ బహదూర్ శాస్త్రి సామాజిక వర్ణ మేరకుంట, అన్నపూర్ణ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, సాంబశివరావు, దాసరి కర్ణ, శ్రీరామ్, సత్యనారాయణ, సుగుణాకర్ రావు, కట్ట బుచ్చన్న గౌడ్ పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్లో..
మల్లాపూర్ డివిజన్ పరిధి నెహ్రు నగర్ కాలనీలో బతుకమ్మ చీరలను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తిగుళ్ల శ్రీనివాస్, తండా వాసుగౌడ్, నాగరం బాబు, శేఖర్ చిన్న దుర్గయ్య, రాపోలు శ్రీనివాస్, శ్రీకాంత్, మహేష్, ధనరాజ్ పాల్గొన్నారు.
ఉప్పల్ : చిల్కానగర్ డివిజన్లోని గణేష్ నగర్, సాయిరాం నగర్, శ్రీగిరి కాలనీ, మహారాజా ఎంక్లేవ్ కాలనీలకు సంబంధించిన ఆడపడుచులకు డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవితో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకానగర్ డివిజన్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కొండల్ రెడ్డి, జగన్, మాస శేఖర్, రామానుజం, నారాయణరెడ్డి, రవీందర్ గౌడ్, బాలు, శ్రీకాంత్, శ్యాము, కాలనీ అసోసియేషన్ సభ్యులు రాజమౌళి,, లక్ష్మీనారాయణ, ఈశ్వర్, శంకర్, వీరారెడ్డి, రాము, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, నాగరాజ్, రవి, సునంద, కమలాకర్, లావణ్య, వసంత, చిలకమ్మా, మానస, తదితరులు పాల్గొన్నారు.