Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కోర్టు పరిధిలో ఉన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చీర్యాల గ్రామ భూవివాదంలో ఉన్న లబ్ధిదారులు వాపో యారు. శుక్రవారం కీసర మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చీర్యాల గ్రామంలో సర్వే నంబర్ 149 212 లో ఎకరా విస్తీర్ణం కలిగిన స్థలాన్ని తాము 2021 అక్టోబర్ 5న నిబంధనల మేరకు సంబంధిత వ్యక్తుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ఈ భూమిలో ఇటీవల కొందరు అక్రమ లేఔట్‌ను సష్టించి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. భూమికి సంబంధించి పట్టాదారుడైన రైతు కొల రాజు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే ఎలాంటి అనుమతులు అనుమతులు లేకుండా లేఔట్ రేపొందించి ఏకంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము హైకోర్టును ఆశ్రయించగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీ అధికారులు వాటిని అమలు చేయకపోగా వివాదంలో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.