Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని యధావిధిగా కొనసాగించాలని టీడీపీ మల్కాజిగిరి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సఫీల్ గూడ చౌరస్తాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ టీడీపీ రాష్ట్ర నాయకులు వగ్గు చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ''ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ'' పేరును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో బిల్లు పెట్టి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నా రు. ఆయనకి కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటే కొత్త వర్సిటీని ర్పాటు చేసి వారి కుటుంబ సభ్యుల పేరు పెట్టుకోవచ్చు అని తెలిపారు. ఎన్టీఆర్ పేరు మార్చితే ఆందోళన చేపడుతమ న్నారు. అంతకు ముందు సఫిల్ గూడ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం, పుష్పాలంకరణ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వగ్గు చంద్రశేఖర్ రావు, కరణం గోపి, పిట్ల రామకృష్ణ, గొల్లగూడ శ్రీనివాస్, బుర్ర రాజు గౌడ్, నరసమ్మ, భాస్కరాచారి, సుమన్, ఈశ్వర్, రాజయ్య, మాధవ్, ఉమేష్ పాల్గొన్నారు.