Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు వారాంతపు సంత (మార్కెట్ ) జరుగుతుంది. ఈ సంతల్లో కొంతమంది దళారులు 100 రూపాయల నకిలీ నోట్లను చలామణి చేస్తూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం. దాదాపు రెండు వారాల క్రితం మధుసూదన్ నగర్లో మంగళవారంనాడు నిర్వహించిన మార్కెట్లో ఓ వినియోగదారుడు కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర నాలుగు రకాలైన కూరగాయలు కొన్నాడు. దానికి 100 రూపాయల బిల్లు కాగా వినియోగదారుడు రెండువందల రూపాయల నోటు ఇవ్వడంతో ఆ వ్యాపారి తిరిగి 100 రూపాయల నోటు ఇచ్చాడు. మరుసటిరోజు వినియగదారుడు ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకుని, కూరగాయల వ్యాపారి ఇచ్చిన 100నోటు ఇవ్వగా అది నకిలీదని చెప్పారు. దాంతో ఆ వినియోగదారుడు మళ్ళీ మంగళవారం మార్కెట్లో ఆ వ్యాపారిని అడిగితే ఆ నోటుతో తనకు సంబంధం లేదని దాబాయించినట్టు ఆ వినియోగదారుడు వాపోయాడు. ఈ నకిలీ నోట్లు ఎలా వస్తున్నాయనేది వినియోగదారులకు, కూరగాయల వ్యాపారులకు కూడా తెలియదు. నకిలీనోట్ల చలామణిని చేస్తున్న వారిని పోలీసులు నిఘావేసి పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.