Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
బతుకమ్మ పండుగ సందర్భంగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి డివిజన్లోని బాతుల చెరువు, కుమ్మరి కుంట వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. కావున ఆడపడుచులకి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా బాతుల చెరువు కుమ్మరి కుంట ఆవరణలో చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయించాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, ముదిరాజ్ సంగం సభ్యులు పిడుగు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు యాదయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పిడుగు రవీందర్, శంకర్, వెంకటేష్, జీవన్ మిత్రబృందం సభ్యులు పండాల శ్రీధర్, గంగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.