Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
గాంధీ సిద్ధాంతాలను అడుగడుగునా తుంగలో తొక్కినవారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే గాడ్సే వారసులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని లింగోజీగూడ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్‌లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాగోల్ చౌరస్తాలో ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండిసంజరు ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మత రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుపై మండిపడ్డారు. నిత్యావసర ధరల గురించి, మోడీ సర్కార్ ఇస్తామన్న సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ బండి సంజరు మాట్లాడితే బాగుంటుందనానరు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, లింగాల కిషోర్‌గౌడ్, మళ్లారపు శ్రీనివాస్‌రావు, శశిధర్‌రెడ్డి, కుంట్ల నర్సింహా యాదవ్, శ్రీపాల్, శ్రీధర్‌గౌడ్, రమేష్, మంజుల, చరణ్, జైపాల్‌రెడ్డి, రామకృష్ణ యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.