Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతోమంది పేదలకు ఆరోగ్య భద్రతను, భరోసాను కల్పిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ మైత్రి నగర్‌కు చెందిన ప్రసాద్ కిడ్నీ సమస్యతో నిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు కోసం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సంప్రదించి సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి మంజూరైన లక్ష రూపాయల ఎల్.ఓ.సి. చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా సుదీర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కందికంటి శ్రీధర్ గౌడ్, మధుసాగర్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.