Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూకట్పల్లి షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ హెడ్ షానిబ్, శ్రీనివాస్ మాట్లాడారు. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సరికొత్త ధోరణి నెలకొల్పిందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇతర బ్రాండ్లు భారతీయ వారసత్వ ఆభరణాలు, హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ 'డివైన్', వజ్రాభరణాల బ్రాండ్ 'మైన్', అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ 'ఎరా' వంటి ప్రచారంలో చోటుచేసుకున్నాయని అన్నారు. భారత దేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూములలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందుబాటులో ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాల్లో 280 షోరూములతో మలబార్ గ్రూపు తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. మలబార్ గ్రూప్ వార్షిక లాభాల్లో 5 శాతాన్ని విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పేదలకు గహ కల్పన, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చుపెడుతుందని తెలిపారు. బ్రైడల్ జ్యువెలరీ షో సెప్టెంబర్ 23 నుండి 26 వరకు కొనసాగుతుందన్నారు.