Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
- డ్రయినేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గం పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తూ అంబర్‌పేటను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాక డివిజన్ అలీ దర్గా లేన్, అడ్డీఖార్ఖానాలో రూ.4 లక్షలతో చేపడుతున్న డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీలలోని డ్రయినేజీ సమస్యలు పునరావృతం కాకుండా నూతన పైపులైన్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. డ్రయినేజీ, తాగునీటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుధాకర్ జలమండలి మేనేజర్ షాకీర్, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.కె.బాబు, భరత్ ముదిరాజ్, ప్రకాష్‌రెడ్డి, కాశీ నరేష్, కాలేరు రాము, కాలేరు రాజు, యూసుఫ్, అంబటి రవి, సాయాద్ అలీ, లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.