Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్
నవతెలంగాణ-కల్చరల్
అంగ వైకల్యం శాపమో, పాపమో కాదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిర్వహణలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వికలాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ క్రీడలు, కళల్లో వికలాంగులు సైతం అందరితో పోటీపడి పేరు తెచ్చుకుంటుంన్నారని అన్నారు. బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ వకులాభారణం కృష్ణ మోహనరావు మాట్లాడుతూ వికలాంగుల్లో ఆత్మ నూన్యతభావం ఉండరాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సలహాదారు బి. అశోక్ కుమార్, సాయిబాబా గౌడ్, ఉమర్ ఖాన్, మహ్మద్ అలీ, శాంతి వెంకట్, ఉష రెడ్డి తదితరులు పాల్గొనగా సంఘం జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగ కళాకారుల నృత్యాలు పాటలు ఆకట్టుకున్నాయి.