Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు
- తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక
- జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ఎండ, వాన, రాత్రి, పగలు అని తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికు ల గోడు పట్టించుకోవాలనీ, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షులు కె. ఏసురత్నం హెచ్చరించారు. శుక్రవారం పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.ఏసురత్నం మాట్లాడుతూ.. జీతాలు సరిపోక, పెరిగిన ఖర్చులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న పారిశుధ్య కార్మికులకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా నెలకు రూ.24వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాంకీ ఒప్పందంతో పారిశుధ్య కార్మికులు తీవ్రంగా నష్టపోతారనీ, వెంటనే రాంకీ ఒప్పందం రద్దు చేయాలని కోరారు. పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండాపోతుందనీ, 2014లో పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినంట్ చేస్తామని ముఖ్యమంత్రి కెేసీఆర్ హామీని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూ నియన్ ప్రధాన కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కె.రవిచంద్రన్, నాయకులు సుధాకర్, డి.రాములు, పి.హరినాథ్, మార్టిన్, ఆనంద్, చిరంజీవి, అనిత, లక్షమమ్మ, వీణ పాల్గొన్నారు.