Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఏ డిగ్రీ కోర్సు చదివినా సాప్ట్వేర్ ఉద్యోగం చేయడా నికి అర్హులే అని సాప్ట్వేర్ జాబ్ ట్రైనర్ పి.నవీన్ కుమార్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్ లో ప్రముఖ సాప్ట్వేర్ కోచింగ్ ఎన్ఐఐటీ సహకారంతో కళాశా ల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసులు విద్యార్థులకు సాప్ట్వేర్ ఉద్యోగాల మీద అవగాహన కలిగించడానికి శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి నవీన్ కుమార్ సాప్ట్ వేర్ ఉద్యోగాల కోసం ఏ విధంగా ప్రిపేర్ కావాలో విద్యా ర్థులకు చక్కగా వివరించారు. మూడో సంవత్సరం విద్యా ర్థులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరారు. ఈ రంగం లో తమ సంస్థకు 40 ఏండ్ల అనుభవం ఉందనీ, 30 దేశాల్లో మూడున్నర కోట్ల మందికి సాప్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చా మని చెప్పారు. ఈ ఉద్యోగాలను సంపాదిస్తే ఏడాదికి రూ.4-10 లక్షల ప్యాకేజీని సంపాదించవచ్చు అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. జ్యోత్స్న ప్రభ మాట్లడుతూ ఇలాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేశం, నరేందర్రెడ్డి, వెంకటేశ్వరరావు, గీతా నాయక్ పాల్గొన్నారు.