Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపే విధంగా చూడాలని, అప్పుడే పిల్లలు చదువులో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ సురేందర్ యాదవ్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. శనివారం నాగోల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.పీటర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, విద్యార్థుల ప్రగతి, నూతన విద్యా విధానం తదితర అంశాలపై నివేదికను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణా సురేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ పిల్లలు బడి మానేయకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, అప్పుడే వారు చదువుల్లో ముందుకెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, నోసా సభ్యుడు ఈ లింగం, మ్యారి సభ్యురాలు ఆమ్రపాలి, పాఠశాల ఎస్.ఎం. సి. చైర్మెన్ ఎన్.అనిత, సీిఆర్ పి.ధనలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.