Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మీర్పేట్
ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బాలాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ క్వార్టర్స్ దగ్గర ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాపూర్ మండల తహసీిల్దార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.