Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
- రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్‌గౌడ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు అండగా ఉంటామని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొంగు వెంకటేశ్‌గౌడ్ అన్నారు. ఈ మేరకు శనివారం నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏజెంట్ల సహాయ సహకారాలు లేకుండా రియల్ఎస్టేట్ రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. కస్టమర్లు ప్లాట్లు కొనే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు సేవలు అందించడంలో ఏజెంట్లు ముందుంటున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేస్తున్నాయని, కానీ ఈ రంగం నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 22 శాతం ఆదాయం వస్తోందని అన్నారు. రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేలకోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వమే సొంత నిధులతో రియల్ ఎస్టేట్ భవనాలను కట్టించాలని అసోసియేషన్ కమిటీ సభ్యు లు డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా గౌని నరసింహ్మగౌడ్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహమ్మద్ రషీద్, జనరల్ సెక్రటరీగా షేక్ నసీరొద్దీన్, ఉపాధ్యక్షు లుగా ఎర్రోళ్ల వెంకటేష్, స్టేట్ సెక్రటరీగా ఫయాజ్ సాజీద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బుట్ట లావణ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జి.రత్న, జనరల్ సెక్రటరీగా కె.బాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా బుర్ర మోక్షా రాణి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షునిగా చందు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా బి.సైదుల్ యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా జి.మహేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జి.అరుణ యాదవ్, పలువురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.