Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తీరు మార్చుకోవాలి
- ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి, మంచినీటి సరఫరా , రవాణా సమస్యలపై ఏకరువు
- సదరన్‌లో అనేక లుకలుకలు
- సర్వసభ్య సమావేశంలో అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు అగ్రహం వ్యక్తం చేశారు. పలు సర్వ సభ్య సమావేశాల్లో గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలు గురించి అనేక పర్యాయాలుగా సభ దృష్టికి తీసుకొచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ అధికారుల పనితీరులో మార్పురాకపోవడం దారుణమన్నారు. శనివారం అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వసభ్య సమావేశం హయత్‌నగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలు సభ దృష్టికి తీసుకెళ్లారు. పేరుకే మిషన్ భగీరథని, మంచినీళ్లు లేక గ్రామాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నా రన్నారు. పది రోజులకు కూడా ఒక్కసారి నీళ్లు రావడంలేదని అన్నారు. గౌరెల్లి గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాని సర్పంచ్ తుడుం మల్లేష్ మండిపడ్డారు. అధికారులు స్థానంలో వారి అసిస్టెంట్లు సభకు రావడంతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో పింఛన్ల విషయంలో అనేక అవకతతో జరుగుతున్నాయని పేర్కొ న్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన వాహనాల (కార్లు) అడ్డం పెట్టుకొని పింఛన్లు కట్ చేస్తున్నారని పలువురు ప్రజాప్రతి నిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, ఆర్టీసీ, విద్యుత్తు రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై సర్వసభ్య సమావేశంలో సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశం జరుగుతుండగా గ్రామపంచాయతీ కార్యదర్శులు ఎక్కడ అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీకి తలమానికగా మారిన కార్యదర్శులేరని అడగగా ఎంపీడీఓ జోక్యం చేసుకొని ప్రభుత్వ చీరలు పంపిణీ కార్యక్రమంలో ఉన్నారని అనగా, సర్పంచులు అందుకు అధికారుల తీరుపై మండి పడ్డారు. కార్యదర్శులు సమావేశంలో లేకుంటే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వారికి ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సర్పంచ్ పదవి కేవలం గ్రామపంచాయతీలో నామ మాత్రంగానే ఉందని, పాలనా వ్యవస్థ అంత కార్యదర్శిల గుప్పిట్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాలు ప్రజాప్రతినిధులు సమక్షం లోనే ప్రజల చెంతకు చేరాలని, ప్రజలు కోసం మరింత అభివృద్ధి సాధికారత కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బురరేఖ మహేందర్ గౌడ్, జెడ్పీటీసీి బింగి దాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో మమత భాయి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అక్బర్ అలీ ఖాన్, సర్పంచులు ముద్దం స్వరూప, కోట రాధా, దూసరి సుజాత, అంతటి యశోద, జక్క లావణ్య, కొర్ర లావణ్య, కవాడి శ్రీనివాసరెడ్డి, తుడుము మల్లేష్, పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, కరిమెల వెంకటేష్, బుర్ర వీరస్వామి, కావలి రంగయ్య, ఎంపీటీసీిలు దంతూరి అనిత మహేందర్ గౌడ్, బాల లింగ స్వామి,సీక సాయికుమార్, చేగురి వెంకటేష్, సీడీపీిఓ వినితా దేవి, డిప్యూటీ తహసీల్దార్ సంగ్రాంరెడ్డి మిషన్ భగీరథ, విద్యుత్తు, ఆర్టీసీ, పంచాయతిరాజ్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.