Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వైద్యులు నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో శనివారం ఓయూ న్యాయ విద్యార్థులు పత్తి నరేష్, సట్టు రాము, బస్వరాజుల రాకేష్‌లు శనివారం ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17వ తేదిన శిరసుఅఖిల (గర్భిణీ మహిళ) మృతికి వైద్యల నిర్లక్ష్యం కారణం అని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని, ఉన్న తాధికారులపై చర్యలు తీసుకొని, సర్వస్ నుండి తొలగిం చాలని మరియు బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా ఆ పుట్టిన (పసిబిడ్డ) పేరుపై 50,00,000 (యాభైై లక్షల రూపాయలు) ఫిక్సడ్ డిపాజిట్ చేయాలని, విద్యకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఈ కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.