Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఉద్యోగాల కోసం నిరీక్షించకుండ స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని రాణించాలని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాల అన్నారు. మాలక్పేట్ నియోజకవర్గం ముసరాంబాగ్ పరిధిలోని ప్రధాన రహదారిపై నూతనం గా ఏర్పాటయిన శాహిన్స్ మేకప్ స్టూడియో అండ్ అకాడ మిక్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు, అనంతరం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన అన్ని రకాల డిజైన్లను ప్రత్యేకత ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వెరైటీలను అందించి ప్రజల మన్ననలు పొందా లని నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రతమైన, నాణ్యత గల జాగ్రత్త పాటించాలన్నారు. అభివద్ధి చెందాలంటే మారుతున్న కాలానుగుణంగా కష్టపడి పురోగతి చెంది వినియోగదారులకు మంచి సేవలు అందించినప్పుడే వినియగదారులు ఎల్లప్పుడూ మీ సేవ సౌకర్యాలు అందుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, సిబ్బంది ఎంఐఎం యాక్టివ్ లీడర్స్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.