Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎల్బీనగర్ నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మాజీ కార్పొరేటర్లతో కలిసి తెలంగాణ పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని వారి నివాసంలో కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గం సమస్య లపై, పార్టీ పటిష్టతపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎల్బీనగర్లో తాగునీరు, భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్లు, ప్లై ఓవర్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సహకారంతో 1000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగినదని, ఇప్పుడు కూడ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తామని, ఎల్బీనగర్లో టీఆర్ఎస్ పటిష్ఠతకు మీరందరు కలిసికట్టుగా పనిచేయాలని, ఎల్బీనగర్లో పార్టీ పరిస్థితిపై వారి దృష్టికి తీసుకెళ్తానని, మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, సామ తిరుమలరెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, కొప్పుల విఠల్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ సీినియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, రమావత్ శ్రీనివాస్ నాయక్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, పవన్, రమణారెడ్డి, వీరన్న యాదవ్, తిరుమలరెడ్డి తదితరులున్నారు.