Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
మెహిదీపట్నంలోని శ్రీ మేధావి జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, డైరెక్టర్ పూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లా డుతూ ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్య త్తును నిర్ణయించడంలో ఇంటర్మీడియట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థులు తమ దృష్టిని చదువుపైనే కేంద్రీకరించి భవిష్యత్తుకు పూలబాటలు ఏర్పాటు చేసుకో వాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల డైరెక్టర్ పూర్ణ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వయసులో విద్యార్థులు తేలికగా చెడు వ్యసనాలకు గురి అయ్యే ప్రమాదం ఉంద న్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ దృష్టిని విద్యపైనే కేటాయిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని స్పష్టం చేశారు. అనంతరం జరిగిన సాంస్కతిక కార్యక్రమాలలో విద్యార్థిని విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.