Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మాయిగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం దమ్మాయిగూడ మున్సిపా లిటీలో 13వ వార్డు బానేయకట్ట కల్వర్టు పైప్ లైన్ రూ.51 లక్షల హెచ్ఎండీఏ నిధులతో, 15వ వార్డులో సుమారు 1500 గజాలు సురక్ష ఎనక్లేవ్ పార్క్ డెవలప్మెంట్ రూ.కోటి రెండు లక్షల వ్యయంతో హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్పర్సన్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు సుజాత శ్రీనివాస్, పావని నరేందర్ రెడ్డి, శ్రీహరి గౌడ్, మున్సిపల్ కమిషనర్ స్వామి, డీఈ సుమతి, హెచ్ఎండీఏ అధికారులు డీఈ వెంకటరమణ, ఏఈ వెంకన్న, నాయకులు శ్రీకాంత్ గౌడ్, హరి గౌడ, యాదగిరి గౌడ్, నరహరి రెడ్డి, వల్లి కాజా మియా, కార్తీక్ గౌడ్, లక్ష్మి ప్రసన్న, సంధ్య, సుజాత, టీఆర్ఎస్ వార్డ్ ప్రెసిడెంట్లు, మహిళా నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.