Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు గౌతమ్ నగర్ పరిధిలోని హిల్ టాప్ కాలనీలో మంజిరా వాటర్ పైప్ లైన్ పనులను టీఆర్ఎస్ నాయ కులు మేకల రామూయాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు దూరయ్యే పనుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డివిజన్లో పెండింగులో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు సహకరించాలని కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.