Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్ పేట్
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ సౌత్ జిల్లా కార్యదర్శి పి. నాగేశ్వర్, ఉపాధ్యక్షులు కె.జంగయ్య పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నా కరపత్రాలను గోషామహల్ నియోజకవర్గం, బేగంబజార్ డివిజన్ అఫ్జల్గంజ్ ప్రాంతంలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు జె.జంగ మ్మ, ఎస్.మణెమ్మ, ఎం.శివరాజు, కె.కళమ్మ, పి.నర్సమ్మ, గోపాలమ్మ, ఎస్.లక్ష్మమ్మ, పి.అండాలు, ఇతరులు, తదితరులు పాల్గొన్నారు.