Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఫార్మా అసోసియేషన్
- రాష్ట్ర అధ్యక్షులు కొలిపక బాలరాజు
- ఇందిరాపార్కు వద్ద ఫార్మా ధర్మ దీక్ష
నవతెలంగాణ-అడిక్ మెట్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన షెడ్యూల్ అమెండ్మెంట్ యాక్టును వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొలిపక బాలరాజు డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఫార్మా ధర్మ దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా బాలరాజు మాట్లాడుతూ 1948 ఫార్మసీ యాక్టు ను అమలు చేయాలని కోరారు. బస్తీ దావఖానలో ఫార్మసిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఫార్మసీలో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలని కోరారు. ఫార్మసిస్టుల వేతనం రూ.30వేలు ఉండాలని డిమాండ్ చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆన్లైన్ ఫార్మా విధానాన్ని అరికట్టా లన్నారు. ఫార్మ హబ్‌ను యుద్ద ప్రతిపాదికన నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. 65 (2) సర్క్యులర్‌ను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ ధర్నాలో తెలంగాణ ఫార్మా అసోసియేషన్ ఉపా ధ్యక్షులు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్, ఆర్గనైజేషన్ సెక్రెటరీ వెంకటేష్, ట్రెజరర్ జోగయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సురేందర్, శ్రీనివాస్, రవీందర్ గౌడ్, ఐటీ సెల్ రవితేజ, తదితరులు పాల్గొన్నారు.