Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బచ్పన్ బచావో ఆందోళన జాతీయ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-అడిక్ మెట్
విద్యార్థులు రక్షణ చట్టం హక్కులపై ప్రత్యేక అవగాహన పెంచుకోవాలి అని బచ్ ఫన్ బచావో ఆందోళన జాతీయ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని భారత్ స్కౌట్ మోడల్ స్కూల్లో బాలికలకు బాలల హక్కులు పరిరక్షణ కమిటీ పాస్కో చట్టాలపై అప్స స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించరు. ఈ సద స్సులో బచ్ ఫన్ బచావో ఆందోళన జాతీయ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, జాతీయ అవార్డు గ్రహీత చిక్కిలి మధు బాబు హాజరై మాట్లాడుతూ పాస్కో యాక్టు 2012 ( బాలికలపై లైంగిక దాడి నిరోధక 2012) గురించి బాలికలపై లైంగిక దాడికి పాల్పడితే ఏడేండ్లు జైలు శిక్ష, జీవిత ఖైదీతో పాటు జరిమానా కూడా విధించవచ్చు అన్నారు. బాలికలపై కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ చట్టాన్ని కాపా డాల్సిన అధికారులు లైంగిక దాడికి పాల్పడితే పదేండ్లు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు అని తెలిపారు. బాలికలపై కామ వాంచనతో అసభ్య ప్రవర్తన చేసిన ప్రవే ట్ పార్ట్శ్ తాకినా లైంగిక వ్యాఖ్యలు చేసి లైంగిక ఒత్తిడికి పాల్పడినా ఐదేండ్ల జైలు శిక్ష పడుతుంది అని తెలిపారు. బాలికల పై ఎవరైనా మానసిక ఒత్తడికి గురిచేస్తే టోల్ ఫ్రీ 1098 వెంటనే కాల్ చేయాలని సూచించారు. రాజ్యాం గంలోని ఆర్టికల్ 24 ప్రకారం 14 ఏండ్లలోపుు పిల్లలతో ప్రమాదకర పనులు చేయించుకోకూడదు అన్నారు. ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల ఓదాభిక ఉంక్రసీ ప్రకారం ప్రపంచ దేశాలలోని అందరూ పిల్లలు కుల మాత లింగ విభేదం లేకుండా సమానంగా చూడాలన్నారు. బాలల హక్కులను జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు అని నాలుగు రకాలుగా విభజించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, అప్స సమన్వ య కార్య కర్త బొట్టు రమేష్, శ్రావణి, పాఠశాల టీచర్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.