Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రదర్శనలో పలు రాష్ట్రాల ఉత్పత్తులు
- నెల రోజుల పాటు ప్రదర్శన
- ప్రారంభించిన ఎమ్మెల్యే సాయన్న
నవతెలంగాణ-కంటోన్మెంట్
తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ లాలామియా బస్తీలో వికాస్ జైన్ ఏర్పాటు చేసిన కళా సిల్క్ హ్యాండ్లూం, హ్యాండ క్రాీఫ్ట్స్ ఎగ్జిబిషన్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కళాకారులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనలో పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీ లించారు. అందుబాటులో వస్త్ర ప్రదర్శనలో బెంగాళీ కాటన్ సారీస్, చందేరీ సిల్క్ సారీస్, కలంకారీ, బెనారస్, కోక్కత్తా, తమిళనాడు, మధురై సారీస్, గద్వాల్ సారీస్, మెటీరియల్, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ ప్రదేశంలో నెలకొల్పారు. ఈ సందర్భంగా నిర్వాకులు వికాస్ జైన్ మాట్లాడుతూ కళాకారులకు చేయూతనిచ్చేందుకు వారు చేసిన ఉత్పత్తులకు కళాత్రీయులు కొనుగోలు చేసుకునేం దుకుగాను నెలరోజుల పాటు ఈ ప్రదర్శన నెలకొల్పినట్టు చెప్పారు. పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రజల ఆదరణ పొందేందుకు ఈ ప్రదర్శనలో వారి ఉత్పత్తులను నెలకొల్పారని వివరించారు. కంటోన్మెంట్ అన్ని వార్డుల్లో కళాకారులు వచ్చి ప్రదేశం తిలకించి చేతికళాకారులకు హ్యాండ్లూమ్ కళాకారులకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మెన్ టీఎన్ శ్రీనివాస్, నాయకులు మధుకర్, సరిత, నివేదిత తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా నిర్వాహకలు వికాసం జైన్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ నాయకులను సన్మానించారు.