Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాంకీ సంస్థ వారు జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ సఫాయి కార్మికులకు స్వచ్చందంగా అందజేయనున్ను డస్ట్ బిన్లను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పంపిణీ చేసి మాట్లాడారు. సఫాయి కార్మికులు ఊడ్చిన చెత్తను డస్ట్ బిన్లలో వేయాలన్నారు. రోడ్లపై చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కలుపొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, రాంకీ సంస్థ కాప్రా సర్కిల్ సిబ్బంది ఇన్చార్జి అమణుల్లా ఖాన్, జవాన్ యాదగిరి, ప్రభాకర్, నరేష్, లక్ష్మీ, స్వప్న, లలిత, స్థానిక నాయకులు, తండా వాసుగౌడ్, ఫైళ్ల ప్రవీణ్, నాయకులు కూర్మన్న, నాగరాజు, రాపోలు శ్రీనివాస్, రఘు, శ్రీహరి గౌడ్ పాల్గొన్నారు.