Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.100 కూడా పలకని చీరలు
- చేనేతలకు చీరలు తయారీకి ఇస్తే మంచిదే
- ప్రజలను మభ్య పెట్టేందుకే నాణ్యతలేని చీరల పంపిణీ
- కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి ఆరోపణ
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటనకే పరిమితమయ్యారని, నాణ్యతలేని చీరలు పంపిణీ చేస్తున్నారని చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో చేనేతలు నేసిన నాణ్యమైన చీరలు పంచితే చేనేతలకు అండగా మహిళలకు గౌరవంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం నాణ్యత లేని చీరల పంపిణీ కారణంగా డబ్బు వధా, అగౌరవంగా ఇచ్చిన చీరలు కట్టలేని పరిస్థితులలో మహిళలు పంపిణీ కేంద్రం వద్ద ఆదివారం ఆందోళన చేపట్టినట్లు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చంపపేట్ డివిజన్లోని చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా నాణ్యతలేని చీరలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ క్రాంతి యువజన సంఘం వద్ద పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని చాల సంతోషించాము, తీరా ఆ చీరలను తనిఖీ చేశాక అర్థమైంది ఇంత దారుణంగా మహిళలను మోసం చేస్తాడని అనుకోలేదు అని అన్నారు. వంద కూడా ధర లేని ఈ చీర కోసమా రెండు మూడు వందల కూలి వదులుకొని పడిగాపులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏ.ఎం.సి నర్సింగ్ రావు, టి.ఐ ప్రవీణ్ కుమార్, ఎస్.ఎఫ్.ఏ యాదగిరి, చంపాపేట్ డివిజన్ బి జె పి అధ్యక్షులు పో రెడ్డి రవీందర్ రెడ్డి ,బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి,సుంకరి రమేష్ గౌడ్,లింగాల దశరథ్ గౌడ్ శ్రీధర్ గౌడ్,వేణు గౌడ్,సాయిరాం గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.