Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మరక్షణ, సెల్ఫ్ కన్ఫిడెన్స్ కు కరాటే, మార్షల్ ఆర్ట్స్ అవసరం
సినీ నటుడు సుమన్
నవతెలంగాణ-ఓయూ
నా తల్లిదండ్రుల ముందుచూపుతోనే నన్ను 11 ఏటా మార్షల్ ఆర్ట్స్‌లో చేర్పించారని,వారు ఆశీర్వాదం, మార్షల్ ఆర్ట్స్ పుణ్యమా అంటూ నేడు నేను ఈ స్థాయికి చేరుకు న్నట్లు సినీ నటుడు సుమన్ చెప్పారు. ఆదివారం తార్నాక సాంఘి స్కూల్లో బ్రుస్లి సోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్, డెరైక్టర్ నల్ల శివప్రసాద్ వారి ఆధ్వర్యంలో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ మరియు కలర్ బెల్టు ప్రధాన కార్యాలయంలో అయిన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆటలు కరాటే, మార్షల్ ఆర్ట్స్, కుంపు, తైక్వండో, ఇవన్ని మనల్ని మనము సంరక్షణ కోసం మరియు శరీర దఢత్వంలోను,సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతగానో పెంపొందిస్థాయి అని చెప్పారు. మహిళలకు ఇవి చాలా ఉపయోగకరమైనవి అని తల్లిదం డ్రులు వారిని ఆదిశగా ప్రోత్సాహించాలన్నారు.వీటిలో రానున్న జీవితంలో రానున్న గెలుపు ఓటమి నుండి ,ఒడిదుడుగుల నుండి సేఫ్ జోన్లోకి రావడానికి బాటలు వేస్తుందన్నారు. పీస్ ఎంతో అవసరం అన్నారు. విద్యార్థులు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలన్నారు. కారోన సమయంలో డాక్టర్స్, నర్స్,పారిశుద్ధ్య కార్మికుల కృషి ప్రశంసించారు. దేశానికి రైతు, జవాన్ చేస్తున్న సేవాలను కొనియాడారు. కులము, మతము అనే భేదము లేకుండా ఎంచుకున్న రంగాల్లో హార్డ్ వర్క్ తో ముందుకు సాగాలని సూచించారు. మరొక వైపు మన దేశము అత్యంత సేఫ్ కంట్రీ అన్నారు. జీవితంలో ఎంజారు చేయాలంటే ఆరోగ్యం ముఖ్యం అని దాని కోసం వ్యాయమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు 600 కి పేగా సినిమాలు 100 సినిమాలో హీరో నటించిన అని దాని కారణం నా తల్లి తండ్రులు, మార్షల్ ఆర్ట్స్,నా ప్రేక్షకుల దీవెనలు అన్నారు. అనంతరం 30 మందికి బ్లాక్ బెల్ట్స్, 250 మందికి కలర్ బెల్ట్స్ సుమన్ చేతుల మీద గా అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డే వలపమెంట్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, ఓయూ ఇన్స్పెక్టర్ ఎల్.రమేష్ నాయక్, ఫౌండర్ డెరైక్టర్ నల్లా. శివ ప్రసాద్,నారాయణ విద్యా సంస్థల ఏజియం బాల పరమేశ్వర్,కౌన్సిలర్ దామోదర్ లు మాట్లాడారు.కరాటే,మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ ను సత్కరించారు.