Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
కార్మికుల జోలికి వస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హయత్ నగర్ లో ఉన్న లేబర్ అడ్డాలో హయత్నగర్ మండల ప్రధాన కార్యదర్శి రామావత్ సక్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బీహార్ చతీస్ఘడ్ మహారాష్ట్ర కర్ణాటక నుండి కార్మికులను బిల్డర్లు తెచ్చుకో వడం వలన స్థానికమైన కార్మికులకు జీవన ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ముందుగా స్థానిక కార్మికులకు మాత్రమే అవకాశం కల్పించాలి బయట నుండి వచ్చినవాళ్లు తక్కువ రేటుకు కూలి మాట్లాడుకుని పోతున్నారు. కాబట్టి బిల్డర్లు కాంట్రాక్టర్లు స్థానిక కార్మికులను దష్టిలో పెట్టుకొని ఉపాధి కల్పించాలి.
అదేవిధంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్లుగా చేసి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడాన్ని ఈ దేశ యావత్ కార్మిక లోకం వ్యతిరేకిస్తుందని అలాగే కోవిడ్ కారణంగా మొదటి దఫా, రెండోదఫా నష్టపోయినటువంటికార్మిక కుటుంబాలకు దసరా కానుకగా ప్రతి నెల 6500 రూలను ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం ఆపాలని. కోట్లాది మంది కార్మికులుకు వర్తించే ఈ.పీి.ఎస్. పెన్షన్ నెల కు రూ.10.000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాది హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నటు వంటి భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహణ అధ్యక్షులు దాసరి ప్రసాద్, సీపీిఐ హయత్ నగర్ మండల సహాయ కార్యదర్శిని శేషురాజు, పల్లి శ్రీదేవి, జానీ, నాగేష్, రమేష్ ,మల్లేష్, జనార్ధన్, శ్రీను, రామచంద్రయ్య, కోటి, మధు, చంటి, విష్ణు, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.