Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-నాగోల్
నాగోల్ డివిజన్లో గత 20సంవత్సరాలుగా నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం చివరి దశలో ఉందని త్వరలో పరిష్కారం కానుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పిబిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆయా కాలనీల రిజిస్ట్రేషన్ల బాధితుల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ గడిచిన 20 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీంతో గత ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడంలో విఫలం చెందారని తెలిపారు. తాను టీఆర్ఎస్లోకి వెళ్ళగానే నాగోల్‌తోపాటు బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో కూడా ఇదే సమస్య ఉందని, రెండూ ఒకే రకమైన సమస్యలు కావడంతో ప్రత్యేక దష్టిని సారించి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్లి సమస్యపై పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. దీంతో కేటీఆర్ అధ్యక్షతన ఏడు మందితో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించిందని, సబ్ కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు.
క్యాబినెట్ సమావేశం స్పందించి 58, 59 జీఓలతో కలిపి ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్లు తెలపగా ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల జరిగిన ఈ సమస్య పరిష్కారాన్ని ఎటువంటి జీఓ లతో ముడిపెట్టకుండా, ఎలాంటి డబ్బులు చెల్లించే విధానం లేకుండా సమస్యను పరిష్కరించాలని తాను ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రెటరీలను కోరినట్లు తెలిపారు. దీంతో వారు స్పందించారని సమస్య పరిష్కారానికి చివరి దశలో ఉందని, త్వరలో పరిష్కారం కానుంది అని ఎమ్మెల్యే తెలిపారు. దసరాకు గాని, దీపావళికి గాని నాగోల్ డివిజన్లోని సాయినగర్, గణేష్‌నగర్, సౌత్ సాయినగర్, ఈశ్వరిపురి, వీరారెడ్డి కాలనీలతో పాటు ఆయా కాలనీలలో నెలకొన్న రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కార శుభ సమాచారాన్ని కానుకగా అందిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తాననే మ్యానుఫెస్టోతో తాను గత ఎన్నికల్లో పోటీ చేశానని దానికి నన్ను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అన్నారు. నియోజకవర్గం అభివద్ధే తమ లక్ష్యంగా ముందుకు వెళుతున్నానని ఆటో నగర్లో ఉన్న డంపు యార్డు తరలించి దేశంలోని ఎక్కడలేని విధంగా పూలవనాన్ని పెంచుతున్నట్టు తెలిపారు. ఈ వనంలో 365 రోజుల పాటు పూలు పూసే మొక్కలను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. సాగర్ రింగ్ రోడ్డు ,ఎల్బీనగర్, కామినేని, నాగోల్ చౌరస్తాలతో , ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు అండర్ పాస్ వే లను నిర్మించామని దీంతో ఎల్బినగర్ సిగల్ రహిత ప్రాంత రహదారిగా మారనుందని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, టీఆర్ఎస్ ప్రశాంత్ గౌడ్, డివిజన్ టీిఆర్‌ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి అయా కాలనీలో కోఆర్డినేషన్ అధ్యక్షులు శరత్‌రెడ్డి, కార్యదర్శి అంజిరెడ్డిలతోపాటు వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు కాలనీలవాసులు పాల్గొన్నారు.