Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు కాసుల కొరత
- జిల్లాలో 15వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్
- సుమారు రూ.150 కోట్ల సాయం అవసరం
- సిబ్బంది కొరతతో క్షేత్రస్థాయిలో విచారణ ఆలస్యం
- ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిరుపేద కుటుంబాలకు వరంగా తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందని ద్రాక్షలా మారింది. బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా ఉన్నప్పటికీ నిధుల మంజూరు, విడుద లలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటంతో హైదరాబాద్ జిల్లాలో దాని అమలు నత్తనడకన సాగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక సహా యం కోసం గంపెడు ఆశలతో అప్పోసొప్పో చేసి ఆడబిడ్డల పెండ్లిండ్లు చేసిన పేద కుటుంబాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము గురించి నెలల తరబడి ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయ గా.. కొద్దిరోజులుగా వీఆర్ఏలు తమ పేస్కేలు, అర్హులకు ప్రమోష న్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇదికాస్త సిబ్బంది కొరతకు దారితీయడంతో పాటు ఉన్నవారిపై పనిభారం పడుతుంది. ప్రస్తుతం పింఛన్లు, ధ్రువీకరణ పత్రాలు జారీ, భూ ముల పరిరక్షణ వంటి విధుల్లోనే సిబ్బంది బిజీబిజీగా ఉండటంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెరుకుపోతున్నాయి.
భారీగా దరఖాస్తులు
జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్లలో మొత్తం 16 మండలాల నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా ల కోసం 15,878 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో కల్యాణలక్ష్మి కింద 4022 దరఖాస్తులు రాగా.. ఇందులో తహసీ ల్దార్లు 1005 దరఖాస్తులను పరిశీలించగా.. ఇంకా 3,017 పెండి ంగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్లు పరిశీలించి ఎమ్మెల్యేల వద్దకు పంపి ంచిన వాటిలో 382 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 32 దరఖాస్తులు తహసీల్దార్ స్థాయిలో రిజెక్టయ్యాయి. ఎమ్మెల్యేల ద్వారా ఆమోదం పొందిన 455 దరఖాస్తులకు బిల్లుల శాంక్షన్ కావాల్సి ఉంది. ఇదిలావుంటే షాదీముబారక్ పరిస్థితి మరీ దారుణ ంగా ఉంది. షాదీముబారక్ పథకానికి 18,974 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులో 9,759 తహసీల్దార్లు పరిశీలించగా.. 2,453 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎమ్మెల్యే వద్ద 1,219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 141 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 9,759 దరఖాస్తులు ఎమ్మెల్యేలు ఆమోదించగా.. బిల్లులు శాంక్షన్ కావాల్సి ఉన్నాయి. ఇక 62 దరఖాస్తులు శాంక్షన్ అయి బిల్లులు అప్లోడ్ చేయాల్సి ఉంది. 5340 బిల్లులకు ట్రెజరీ నుంచి క్లియరెన్స్ రావాలి. ఇక జిల్లావ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కు కలిపి వచ్చిన మొత్తం 15,878 దరఖాస్తులకుగాను రూ. 158.96 కోట్లు అవసరం పడుతుండగా.. ఇందులో అప్రూవ లయిన 10,214 దరఖాస్తులకు సుమారు రూ.102.25కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇక క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆర్థిక సాయం మంజూరైనా 7,118 బిల్లులు ట్రెజరీలో పెండింగ్ ఉన్నాయి.
సాయం అందలేని ఆఫీసర్లకు మొర!
అమీర్‌పేటకు చెందిన ఓ రోజుకూలీ.. ఈ ఏడాది ప్రారం భంలో తన కూతురు వివాహం చేశాడు. వివాహ అనంతరం ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుపై ఇప్పటివరకు విచా రణ జరగలేదు. రోజు కూలీ కావడంతో తన ఇంటి తలుపు అధికా రులు ఎప్పుడు తడతారో తెలియక కొన్నిసార్లు ఇంటివద్దే ఉంటున్నా నని అతను తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు సంబంధిత తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వ సాయం అందలేదని అధికారులకు ఫిర్యాదు చేస్తుండగా.. తమ వద్ద పెండి ంగ్ లేదని చెబుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ సాయం అందితే పెండ్లికి చేసిన అప్పులు తీర్చాలని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే మిగులుతోంది.