Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్ మణికొండ వేదకుమార్
- ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా 'మూసీ రివర్ ఫ్రంట్ వాక్'
నవతెలంగాణ-అంబర్‌పేట
నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మెన్, అర్బన్ అండ్ రీజినల్ ప్లానర్ మణికొండ వేదకు మార్ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్క రించుకుని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ''ప్రపంచ నదుల దినోత్సవం, కెనడా'' ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సంయుక్తంగా ఆదివారం సాలార్జంగ్ మ్యూజియం వద్ద 'మూసీ రివర్ ఫ్రంట్ వాక్' నిర్వహించారు. అనంతరం చారిత్రాత్మక మూసీ నది ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద కుమార్ దేశంలో అనేక నదుల పరిస్థితి చాలా దారుణంగా ఉంద న్నారు. కొన్ని దశాబ్దాల కంటే నదులు మరింత కలుషితం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ పూర్వపు ప్రధాన నీటి వనరైన మూసీ నది చారిత్రక ప్రాముఖ్యత, విలువలను తెలియ చేయడానికి, వాటి రక్షణ, పునరుద్ధరణకు ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వాక్ ఏర్పాటు చేశామన్నారు. కెనడాలోని వరల్డ్ రివర్స్ డేతో కలిసి ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ గతేడాది కూడా ప్రపంచ నదుల దినోత్స వాన్ని నిర్వహించిందని గుర్తు చేశారు. నీటి మార్గాలు మన జాతీయ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారాలనీ, జలమార్గాలను పునరుద్ధరించడం, వాటి అభివృద్ధి దేశపు ఆర్థిక, పారిశ్రామి క వృద్ధి, జీవనోపాధి, పర్యాటకాన్ని ఉత్తేజపరుస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నీటిపై దృష్టి సారించి, దృఢ సంకల్పంతో, పుష్కలమైన కాల్వలతో నీటి రవాణాకు, పంట నీటిపారుదల, జలవిద్యుత్, తాగునీటి సరఫరా, తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరా మొదలైన ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-ప్రయోజ కరమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణాన్ని చేపట్టి సాధించారన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, టూరిజం, ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా ఆదా యాన్ని పెంచుకోవడానికి అనేక ఇతర మార్గాలను అభి వృద్ధి చేయడానికి అంతర్జాతీయ నీటి నిపుణుల సలహాల ను తీసుకోవడం ద్వారా దీన్ని మరింత ఫలవంతంగా ఉపయోగించుకోవచ్చు అన్నారు. తద్వారా నదులను బహు ళ ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందని తెలిపారు. వచ్చే ప్రపంచ నదుల దినోత్సవంలోపు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ తరపున నిపుణులు, సంబంధిత పౌరులతో కలిసి రాష్ట్రంలోని అన్ని నదులను సందర్శించి, మన రాష్ట్ర నీటి మార్గం ద్వారా అభివృద్ధి కార్యకలాపాల కోసం వివిధ నావిగేషన్ కాన్సెప్ట్‌లను పరిశీలించి తెలుసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఇతర వక్తలు సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, ఎక్సెల్ ఇండియా, క్వాజిత్ తౌసిఫ్ ఇక్బాల్ , ఇవాన్ అభిషేక్ మూసీ నది పుట్టుక స్థలం, పరివా హక ప్రాంతాలు, మూసీ నది ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ సభ్యులు వేణుగోపాలరావు, పి.నరహరి, ఎండీ.అఫ్జల్, సుదర్శన్‌రెడ్డి, ఆదర్శ్, పర్యావ రణవేత్తలు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిని ధులు, జైనాపూర్ ఫౌండేషన్, అమాన్ వేదిక, ఏపీఎస్ఏ, సేవ్ గోల్కొండ, ఎస్ఆర్డీ రెయిన్బో హౌం, ఎస్సీఎస్ఈ సామాజిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అఫ్జల్‌గంజ్ ఎస్ఐ వి.రాంబాబు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటె క్చర్, జేఎన్టీయూ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.